వర్ధన్నపేట అక్టోబర్ 24:వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభ స్థలి ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి.
ఈ నెల 27న భట్టుపల్లి లో నిర్వహించనున్న సీఎం కెసిఆర్ వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభ స్థలిని స్థానిక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి ఆరూరి రమేష్ తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే రమేష్ వివరించగా, మంత్రి ఎర్రబెల్లి ఏర్పాట్ల విషయంలో పలు సూచనలు చేశారు.