వర్గల్ మండల్, నాచారం అక్టోబర్ 1 : నాచారం గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు అర్పించడంలో అర్చకులకు శిక్షణ తరగతులు దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, దేవాలయ ఈవో అన్నపూర్ణాదేవి, దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, వీరశైవ ఆగమ పండితులు ఓదెల, దేవాలయ ప్రధాన అర్చకులు భద్రయ్య, శివాచార్యులు, జరా సంఘం, శివప్రసాద్, బడంపేట్ జగదీశ్వర్, చిన్న వీరయ్య హాజరై వివిధ వీరశైవ పండితులకు దేవాలయంలో చేసేటువంటి నిత్య పూజ కైంకర్యాల గురించి ఆగమశాస్త్రాలపైన అవగాహన కలిగి దేవాలయ నిర్వహణ ఆచార వ్యవహారాలతో చేయాలని వారు కోరారు.
ప్రతి అర్చకుడు వీరశైవ ఆగమ ప్రకారం ఇష్ట లింగ పూజ శివరాధన షోడశ పూజలు వచ్చినటువంటి భక్తులకు కావలసినటువంటి కార్యక్రమాలు వాటిపై అవగాహన నిర్వహించడం జరిగిందని వారన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా లో ఉన్న శైవ వీరశైవ ఆగమ పరంపర అర్చకులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న ఆలయాలలో అర్చనా విధానాలు సక్రమంగా జరిపి పల్లెలు, గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రము, దేశము సుభిక్షంగా ఉండాలని, అందరూ అర్చకులు పూజా విధానాలు సక్రమంగా నిర్వహించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అర్చకులు దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.