*ఆనంద వర్షిణిని సన్మానిస్తున్న గ్రామ సర్పంచ్, అల్లే సత్యం ప్రజాప్రతి నిధులు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని రాజుపేట గ్రామానికి చెందిన కోడూరి ఆనంద వర్షిని ఈనెల 22వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సబ్ జూనియర్ కోకో పోటీలో ఉత్తమ ప్రతిభా కనబరిచిన కోడూరి ఆనంద వర్షిని రాష్ట్రస్థాయిలో జరిగే కోకో పోటికి ఎంపిక చేయడం జరిగింది. సోమవారం రాజుపేట గ్రామస్తులు అందరం శాలువా కప్పి, షీల్డ్ డ్రెస్ ను బహుకరించి ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాజుపేట సర్పంచ్ అల్లే సత్యం, , ఉప సర్పంచ్ కిష్టయ్య, వార్డ్ మెంబర్ రమేష్, సత్యం, శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్ర రమేష్, కో ఆప్షన్ రాజాం, మహిళా సంఘం అధ్యక్షురాలు చంద్రకళ, అల్లే స్వామి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేష్, యువకులు నవీన్, మహేష్, సురేష్, లింగం, రాములు, లింగం, చంద్రం, లలిత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.