ప్రజాసమస్యలపై వెనువెంటనే అధికారుల దృష్టికి ప్రజాసమస్యలను తీసుకువచ్చి వారు ఎదుర్కొంటున్నా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నది మానేర్ తెలంగాణ న్యూస్ ఛానెల్ అని ,ఇట్టి ఛానెల్ ఏర్పాటు చేసిన ఛానెల్ సీఈఓ ఒగ్గు బాలరాజ్ యాదవ్ ను ప్రముఖ ఎన్నారై రాధారపు సత్యం,అన్నారు. ఎల్లారెడ్డిపేటలోని హెచ్.పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఏర్పాటుచేసిన మానేర్ తెలంగాణ న్యూస్ కార్యాలయంను ప్రముఖ ఎన్నారై రాధారపు సత్యం తో కలిసి మండల తహశీల్దార్ ఏ.జయంత్ కుమార్ ,ఎంపీడీఓ బింగి చిరంజీవి ప్రారంభించారు.అనుక్షణం అధికారులను ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయడంలో ముఖ్యంగా ఇటీవల వర్షాకాలంలో వరుసగా వానలు దంచికొట్టిన సమయంలో మానేర్ తెలంగాణ న్యూస్ ఛానెల్ అధికారయంత్రాంగంను కదిలించినదని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ ఎంపీడీఓ బింగి చిరంజీవి అన్నారు.ఈ కార్యక్రమంలో బొప్పపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ ,మండల కో ఆప్షన్ సభ్యులు జబ్బర్, టిఆర్ఎస్ మైనారిటీ సెల్ ఎల్లారెడ్డిపేట పట్టణశాఖ అధ్యక్షుడు సల్మాన్ పద్మశాలి సంఘం నాయకులు సుంకి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
