*ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి*
*అన్ని పాఠశాలలో స్కావేంజర్స్ ని ఏర్పాటుచెయ్యాలి*
*ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు*
చేర్యాల : మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలికల పాఠశాల, చుంచనకోట,వీరన్న పేట జెడ్పిఎస్ఎస్ పాఠశాలలను సందర్శించి కమిటీలు మరియు మెంబెర్షిప్ కార్యక్రమం చేపట్టారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యను భోదించడానికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పెండింగ్ లో ఉన్న వంట కార్మికుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, స్కావేంజర్ సమస్య తీవ్రంగా బాదిస్తుందని అన్నారు. వీరన్నపేట పాఠశాలలో మరుగుదొడ్లు, ప్రహరీ గోడ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆత్మకూరి హరికృష్ణ, నాయకులు వెల్దీ సాయికిరణ్ రెడ్డి, సందీప్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
