రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ లో గంజాయి సాగు చేస్తున్న హైదర్ అనే వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి వెనుక భాగంలో పెంచుతున్న 31 గంజాయి మొక్కలను గుర్తించారు. రెవెన్యూ అధికారులు పంచనామ నిర్వహించి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల రూరల్ సిఐ సదన్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు, ఆర్ఐ మధు, సీనియర్ అసిస్టెంట్,తదితరులున్నారు.
