రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా సూడిద రాజేందర్ ను జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు నియామక పత్రాన్ని గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గుండారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సూడిద రాజేందర్ కు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ సన్మానించింది. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు.
మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు నాయక్ కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాటి రామ్ రెడ్డి నాయకులు రొడ్డ రామచంద్రం గంట బుచ్చగౌడ్ కొత్తపల్లి దేవయ్య మహేందర్ కిషన్ శ్రీనివాస్ గౌడ్ ఎండి ఇమామ్ వంగ మల్లారెడ్డి చెరుకు ఎల్లయ్య కోనేటి పోచయ్య తిరుపతి గౌడ్ గణపతి చెన్నిబాబు తిరుపతిరెడ్డి నరేందర్ అంజిరెడ్డి భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు




