సాహితీగౌతమి ఆధ్వర్యంలో తలపెట్టిన “రామగిరి సాహితీ స్నేహయాత్ర-3” కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి 150మంది కవులు తరలగా సిరిసిల్ల నుండి రెండు టీంలుగా 20 మంది కవులు వెళ్లారు.ఈ సందర్భంగా కవుల సమూహ నాయకులు డా.వాసరవేణి పరశురాం, డా.జనపాల శంకరయ్యలు మాట్లాడుతూ కవుల యాత్రద్వారా చరిత్ర సంస్కృతులు వెలుగులోకి రావడంతోపాటు పుస్తకాలుగా రాయబడుతాయనీ, చారిత్రక ప్రదేశాలుగా గుర్తించబడుతాయనీ, విజ్ఞాన వికాసాలు కలుగుతాయని అన్నారు. భవిష్యత్తులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చారిత్రక ప్రదేశాలకు కవులయాత్ర పెడుతామనీ తెలిపారు. రామగిరిఖిల్లా పెద్దపల్లి జిల్లాలో ఉందనీ ముప్ప భూపాలుడు పాలించాడనీ ,ఇతని ఆస్తానంలో తొలి తెలుగు సంకలనకర్త మడికి సింగన ఉన్నాడనీ ,200 ల వనమూలికలతో నిలయంగా ఉన్న ప్రాంతమనీ యాత్రకు రావడం సంతోషంగా ఉందన్నారు. రామగిరి ఖిల్లా పైవరకు రోడ్డు నిర్మాణంచేస్తే యాత్రికులకు ఇబ్బందులుండవనీ ప్రభుత్వం పర్యాటకేంద్రంగా తీర్చిదిద్దాలనీ అన్నారు.
ఈకవిస్నేహయాత్రలో పెద్దపల్లి అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, నంది శ్రీనివాస్, అనిల్ కుమార్, సిరిసిల్ల కవులు డా.వాసరవేణి పరశురాం, డా.జనపాల శంకరయ్య, వడ్నాల వెంకటేష్, ఎమ్.నారాయణ,భాగ్యలక్ష్మి, దుంపెన రమేశ్,ఇమ్మడోజు మహేందర్, గూడూరి బాలరాజు, సింగిరెడ్డి రాజిరెడ్డి, గుండెల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.
