ప్రాంతీయం

*హామీలు అమలు చేయకుంటే బి ఆర్ఎస్ గడ్డు కాలమే…. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి*

174 Views

తెలుగు న్యూస్ 24/7

నిడమానూరు : సెప్టెంబర్ 27

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ పదేళ్లుగా అనేక హామీలు ఇచ్చారని, ఇచ్చిన హామీల అమలు లో చిత్తశుద్ధి లేదని, అసంఘటిత రంగ కార్మిక వర్గం, ప్రజలు పెద్ద ఎత్తున హాసహనం తో ఉన్నారని, ఇచ్చిన హామీలు పూర్తి గా అమలు చేయకుంట ఎన్నికల్లోకి వెళితే ఈసారి టిఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం నిడమనూరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె చేశారని ప్రభుత్వం హామీతో సమ్మె విరమించినప్పటికీ పూర్తిగా వారి డిమాండ్స్ పరిష్కరించలేదని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు గత 18 రోజులకు నుండి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారి పట్ల సవతి ప్రేమ చూపిస్తుందని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశ వర్కర్లు కూడా సమ్మెలో ఉన్నారని, ఈ రకంగా అన్ని రంగాల అసంఘటిత రంగ కార్మికులు తమ డిమాండ్ల కోసం ప్రభుత్వంపై పోరాడుతున్నారని, వారిని పట్టించుకోకుండా, నిర్బంధాలు,దాడులు, దౌర్జన్యాలకు, బెదిరింపులకు దిగుతున్నారని వారన్నారు. అసంఘటితరంగ కార్మికులతో ప్రభుత్వం ఊడిగం చేయించుకుంటుందని, తమ సమస్యలు పరిష్కరించ మంటే ఉద్యోగం నుండి పీకేస్తామని బెదిరిస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే, కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే వారిని పదవుల నుండి ఊడబీకే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అనేక మందికి రుణమాఫీ వర్తింప చేయలేదని, లక్ష వరకు రుణమాఫీ అని చెప్పి ఒక రూపాయి తేడాతో అనేకమంది రైతుల ను రుణమాఫీకి దూరం చేశారని ఇది సరైనది కాదని, లక్ష వరకు పూర్తిగా రుణమాఫీ చేయాల్సిందేనని ఆయన అన్నారు. ప్రభుత్వ హామీలు అన్ని ప్రజల కు అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి నాకించినట్లుగా ఉందని ఆయన హెద్దేవా చేశారు. ప్రభుత్వం ఇస్తానన్న గృహలక్ష్మి పథకం అర్హులకు కాకుండా అనర్హులకు వర్తింప చేస్తున్నారని, నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారని ఆయన అన్నారు.రాజకీయాలకతీతంగా అర్హులైన నిరుపేదలకు మాత్రమే గృహలక్ష్మి పథకం మంజూరు చేయాలని, పూర్తయిన చోట్ల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, లబ్ధిదారులకు అప్పగించాలని అన్నారు. దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందులు ఎన్నికలకు ముందే పూర్తిగా అమలు చేయాలని, ఎన్నికల ప్రచార పథకాలుగా కాకుండా నిజమైన అర్హులకు అందించి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని, చివరి క్యాబినెట్ సమావేశం ఈ నెలలో జరుగుతుందని ఈలోపే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, డబ్బికారి మల్లేష్, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, వీరెల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు సలీం, కొండేటి శ్రీను, ఊట్కూర్ నారాయణరెడ్డి, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్, కోమండ్ల గురువయ్య తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
బొంగరాల శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *