మంచిర్యాల జిల్లా
శ్రీయుత గౌరవనీయులైన మంచిర్యాల జిల్లా వైద్యా ఆరోగ్య DMHO కి నమస్కరించి వ్రాయునది.
*విషయం!కిడ్నీలు పాడైపోతున్నాయి మహాప్రభు*
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కి సంబంధించిన చికిత్సలు మరింత అభివృద్ధి చేయాలి డయాలసిస్ రోజుకి పది మందికి చేస్తున్నారు మరింత డెవలప్మెంట్ చేసి డయాలసిస్ చేయడానికి కావలసిన పరికరాలను మెరుగుపరచాలని పెద ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాము.
గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకి కిడ్నీలపై అవగాహన సదస్సులు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేయాలని కోరుతూ.
మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలలో కిడ్నీ సమస్యతో చాలా మంది ప్రజలు బాధ పడుతున్నారు కిడ్నీ సమస్య విపరీతంగా పెరిగిపోతున్నాయి కిడ్నీ వ్యాధి సమస్య వయసు తో సంబంధం లేకుండా కిడ్నీలు పాడైపోతున్నాయి. కిడ్నీ లకు సంబంధించినటువంటి వ్యాధి ఎందువల్ల వస్తుంది, అనేది అర్థం కాని పరిస్థితి క్రియాటిన్ పెరగడం క్రియాటిన్ పెరిగినది అని తెలిసిన తరువాత వెంటనే సకాలంలో వైద్యం అందితే కిడ్నీలు కొంతమేరకు పనిచేసే అవకాశం ఉంది లేనియెడల కిడ్నీలు పూర్తిస్థాయిలో పనిచేయలేని పరిస్థితికి వెళ్తున్నాయి అప్పుడు డయాలసిస్ చేస్తేనే ఆ మనిషి బ్రతకడం జరుగుతుంది లేకుంటే కిడ్నీ మార్పిడి మన పేద ప్రజలకు కిడ్నీ మార్పిడి అనేది జరిగే ప్రక్రియ కాదు తప్పనిసరి పరిస్థితుల్లో డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ డయాలసిస్ అనేది మనిషిలో ఒకసారి ప్రవేశిస్తే డయాలసిస్ రోగి కిడ్నీలను బట్టి డయాలసిస్ రోజు విడిచి రోజు లేక విడతల వారిగా ఉంటుంది అలాంటప్పుడు చాలా సమస్య అవుతుంది. డయాలసిస్ అనేది ఆపేస్తే మనిషి చనిపోవడం జరుగుతుంది అసలు ఈ కిడ్నీ సమస్య నీటిలో ఉండే లోపాల ద్వారా వస్తున్నద లేక ఆంటీబయాటిక్ వాడడం వల్ల వస్తుందా లేక తినే తిండి ద్వారా వస్తుందా అనేది అర్థం కాని పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా గ్రామాల్లో ఉండేటువంటి నిరుపేద కుటుంబంలో ఇంటి ఒక్క కిడ్నీ బాధితుడు ఏర్పడుతున్నారు.
చిత్రంఏమిటంటే నెఫ్రాళ్లు దెబ్బతింటున్న తొలి దశలో పైకి ఏమి తెలియకపోవటం ఇది నెమ్మదిగా దెబ్బతింటూ వస్తాయి దీంతో కిడ్నీల సామర్థ్యం క్రమంగా మందగిస్తుంది చివరికి పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి కిడ్నీ వైఫల్యం వస్తుంది అప్పుడు డయాలసిస్,కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు ఎందుకంటే ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే తిరిగీ మామూలు స్థాయికి రావడం ఆసాధ్యం కానీ తొలిదాశలో గుర్తిస్తే కిడ్నీలు త్వరగా దెబ్బతినకుండా జబ్బు ముదరకుండా చూసుకోవచ్చు కాబట్టి కిడ్నీల ఆరోగ్యం మీద పేద ప్రజలకు రాష్ట్ర ఆరోగ్య వైద్యశాఖ గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి కిడ్నీలను కాపాడుకునే విధంగా చూడాలని చెప్పి పేద ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
స్పందన మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి DMHO డాక్టర్ హరీష్ రాజు స్పందిస్తూ తప్పకుండా అందరికీ గ్రామాలలో కిడ్నీ వ్యాధి సమస్యలతో దయచేసి మారిన పడకుండా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.
మంచిర్యాల జిల్లా ప్రజలందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో DEMHO బుక్క వెంకటేశ్వర్, అని వంజరి వెంకటేష్, సామాజికవేత్త 7702642077, బండి, బుజ్జి హరీ, రెడ్డి రాజుల సాయి కిరణ్ ,కంది ప్రదీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
