తెలంగాణ ప్రభుత్వం దసరా నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు అల్పాహారం పెడతామనడం చాలా విడ్డూరంగా ఉందని దేవేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాలలో గర్భవతులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పోషకాహారం అందించకుండా, పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించకుండా అటు అంగన్వాడిలు ఇటు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా విఫలమై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులకు అల్పాహారం పెడతామనడం హాస్యాస్పదంగా ఉన్నదని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నేవూరి దేవేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు
