కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ గెలిచిన సందర్భంగా
హుస్నాబాద్ పట్టణంలో విజయోత్సవ ర్యాలీ
సిద్దిపేట్ జిల్లా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నిన్న వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ రెండు లక్షల 25వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించిన సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ దొడ్డ శ్రీనివాస్ మండల అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నీ హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి గాంధీ మల్లె చెట్టు అంబేద్కర్ చౌరస్తా వరకు కార్యకర్తలు రంగులు బాణ సంచాలు పేల్చుకుంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక మంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎన్నో ప్రలోభాల గురిచేసిన హుస్నాబాద్ నియోజకవర్గ ఓటర్ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఓటర్లందరికి కృతజ్ఞతలు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు లక్కిరెడ్డి తిరుమల మహిళా మోర్చా అధికార ప్రతినిధి తోట స్వరూప ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొమ్మగానిసతీష్ అక్కన్నపేట మండల అధ్యక్షులు మహేందర్ పట్టణ కార్యదర్శిలు తగరం లక్ష్మణ్ చందు మండల ప్రధాన కార్యదర్శిలు సంపద నాయక్ మహేశ్వర్రెడ్డి బొల్లి శ్రీనివాస్ బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి భూశంకర్ మండల అధ్యక్షుడు పోలేదు రాజేందర్ కుమారస్వామి చార్జీలు శంకర్ వీరాచారి అనంతస్వామి కురుమల్లి శ్రీనివాస్ తోట సమ్మయ్య మల్లం ప్రశాంత్ అరుణ్ రైనా నాయక్ భూతాక్షు లక్ష్మయ్య రాంరెడ్డి రాజేష్ సామ్రాజశేఖర్ వెంకటేష్ అనిత కార్యకర్తలు బిజెపి అభిమానులు మహిళలు పాల్గొన్నారు





