విద్యార్థులు సామాజిక సేవకులుగా రాణించాలి”
జాతీయ సేవాపథకం
దినోత్సవం)
ఎల్లారెడ్డపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం దినోత్సవం నిర్వహించడం జరిగింది. అంతకుముందు ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాలలో సేవలందించిన విద్యార్థులకు మెమొంటోలు బహుకరించారు ఈ సందర్భంగా *ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ 1969లో సెప్టెంబర్ 24న అప్పటి కేంద్ర విద్యాశాఖమంత్రి డా.వి.కె.ఆర్.వి రావు ప్రారంభించారన్నారు. విద్యార్థులను సామాజిక సేవకులుగా మలుచడం, నాయకత్వలక్షణాలు పెంపొందింపజేయడం, శ్రమజీవనం అలవాటుచేయడం, నైపుణ్యాలను వెలికితీయడం జాతీయసేవాపథకం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. విద్యాలయాలలో పరిశుభ్రంచేయడం, రోడ్లు, మురికికాలువలు శుభ్రంచేయడం, రోడ్లు వేయడం, వరదలు వచ్చినప్పడు సహాయం చేయడం, నిరక్షరాస్యత, మూడనమ్మకాలను తొలగించడం , పేదలకోసం విరాళాలు సేకరించి ఆర్థికసహాయం* అందించడంలాంటి అనేక కార్యక్రమాలు జాతీయ సేవాపథకం(ఎన్.ఎస్.ఎస్) ద్వారా చేపట్టవచ్చునన్నారు. విద్యార్థులు సామాజికసేవలో భాగస్వాములు కావాలని ఉత్తమపౌరులుగా రాణించాలని, ఎన్.ఎస్.ఎస్.ఆవిర్భావదినోత్సవం కళాశాలలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న వాలంటీర్లు సందీప్, అరుణ్, విజయ్, రాకేశ్, శాదుల్,ప్రవళిక, అక్షయ, సల్మాన్లకు మెమొంటోలు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో *ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు, చెరుకు భూమక్క,మాదాసు చంద్రమౌళి, నీరటి విష్ణుప్రసాద్, కొడిముంజ సాగర్, ఆర్.గీత, చిలుక ప్రవళిక ,గౌతమి బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, దేవేందర్,తాజోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
