(మానకొండూర్ సెప్టెంబర్ 26)
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలితరం తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను మానకొండూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మానకొండూరు మండల అధ్యక్షులు ముక్కెర సతీష్ కుమార్ మాట్లాడుతూ..
భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగువకు చాటి చెప్పి ప్రపంచ మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ తొలితరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక నిప్పుకానికగా రైతాంగ సాయుధ పోరాటంలో బాంచన్ కాళ్లు మొక్కుతానే నుండి బతికేందుకనే విధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలను ఎదిరిస్తూ దున్నే వాడిది భూమైన నినాదంతో ఒక నిప్పు కనికలాగా చాకలి ఐలమ్మ రక్తాన్ని చిందిస్తూ 10 లక్షల ఎకరాల భూమిని రైతాంగానికి పంపింణి చేశారు. అదే స్ఫూర్తితో మనమందరం కలిసికట్టుగా నేటితరం దోపిడి పాలకులను తరిమికొట్టాలని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం నుండి మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటున్నాను సాధిద్దాం చాకలి ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం.
ఈ కార్యక్రమం లో మానకొండూరు కార్యదర్శులు నడి గొట్టు శంకర్, బొడ్డు నరేష్, బొడ్డు ఐలయ్య , కోశాధికారి వేల్పుగొండ సంపత్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, చేర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.