*_ఆపరేషన్ చిరుత….బోనులో చిక్కిన నాలుగో చిరుత._*
_గత కొద్ది రోజులుగా భక్తులకు, అధికారులకు నిద్ర లేకుండ భయపెట్టిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి నడక మార్గంలో మరో చిరుత చిక్కింది._
_ 7వ మైలురాయి వద్ద బోనులో పడింది._
_ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పది రోజులుగా ప్రయత్నిస్తున్నారు._
_ఎట్టకేలకు ఎర వేయడంతో ఎట్టకేలకు చిరుత చిక్కింది._
_ఇప్పటివరకు 4 చిరుతలు చిక్కాయి. దీంతో శేషాచల కొండలలో ఆపరేషన్ చిరుత ముగిసింది._
_ఇక నుంచి భక్తులు నడకమార్గంలో ప్రశాంతంగా వెళ్లేందుకు మార్గం సుగమమైంది…!!_





