సెప్టెంబర్ 22 గజ్వేల్
ఆర్ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు రాజు బోడను తక్షణమే అరెస్టు చేయాలి
౼బిఎస్పీ గజ్వేల్ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ డిమాండ్
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ IPS (రిటైడ్) గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్ఆర్ఐ రాజ్ బోడ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ డిమాండ్ చేస్తూ మార్కుక్ మండల పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. ఆయన మాట్లాడుతూ బహుజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి బిఎస్పీ ని బలోపేతం చేస్తున్న క్రమంలో భరించలేక బహుజనుల ముద్దు బిడ్డ ప్రవీణ్ కుమార్ గారి పై రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ల కుట్ర పూరిత చర్యలో భాగంగానే ఈవిదంగా చేస్తున్నారని ఖండించారు.అసలు ఇన్నేళ్ల స్వాతంత్ర భారతంలో బహుజనుల బతుకులూ పేదరికం నలిగిపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆయన విమర్శించారు.కావున ఆరెస్పీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజు బోడ పై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోశాధికారి మొండి కర్ణాకర్ గారు, పాములపర్తి గ్రామ బూత్ అధ్యక్షులు D. బాలకిషన్ గారు, ఇప్పలగూడెం గ్రామ అధ్యక్షులు T. నవీన్,శరదని రాము, కొండనోళ్ళ వంశి,డబిలిపురం కర్ణాకర్,శరదని శ్రీశైలం, రాజంగారి భాను, కర్రోళ్ల నవీన్ పాల్గొన్నారు.
