తెలంగాణ విమోచన దినోత్స వం జరుపుకోవడం గర్వంగా ఉంది
ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 17
మంగపేట మండలంలో తెలంగాణ విమోచన దినో త్సవాన్ని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు లోడే శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతి నిధి తాటి కృష్ణ హాజర య్యా రు.తాటి కృష్ణ జాతీయ పతా కం ఎగురవేశారు.కృష్ణ మాట్లా డుతూ తెలంగాణ ప్రజానీకానికి నిజమైన స్వాతంత్రం సెప్టెంబర్ 17 న వచ్చిందని తెలంగాణ ప్రజలు విముక్తి పొందినటు వంటి ఈనాటి సందర్భంగా ఈ తెలంగాణ విమోచన దినోత్స వం జరుపుకోవడం గర్వంగా ఉందని ఈ తెలంగాణ విమో చన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వ హించకుండా తెలంగాణ సమై క్యత దినోత్సవం అనే పేరుతో వంకర బుద్ధితో వంకర ఆలోచ నలతో చేస్తున్నటువంటి దానిని మేము తీవ్రంగా ఖండిస్తు న్నామని తెలంగాణ విమోచన దినోత్సవం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాలు చేయడం తెలం గాణ ప్రజలుగా మేము గర్వప డుతున్నామని చెప్పారు. భార తదేశ సార్వభౌమా ధికారాన్ని ప్రపంచానికి తెలియజేసినటు వంటి గొప్ప నేత మహనీ యుడు విశ్వవిఖ్యాత గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా కేకు కట్ చేసి పండుగలా నిర్వ హించుకోవడం చాలా ఆనందం గా ఉందని అది మాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్ర మంలో మండల ఉపాధ్యక్షుడు చీకట్ల యాకస్వామి,మండల గిరిజన మోర్చా అధ్యక్షుడు కల్తి రామకృష్ణ,జిల్లా దళిత మోర్చా కార్యదర్శి మల్యాల రవీందర్, మండల కార్యవర్గ సభ్యుడు తవిటి శ్రీధర్ రెడ్డి,బూత్ అధ్యక్షులు బూర సుధాకర్ గౌడ్,వట్టం సంతోష్,కల్తి విష్ణు, తాటి రాములు,సోయం ప్రసాద్,పుణ్యకుర్తి సతీష్, గుండెబోయిన రామస్వామి, అనంతుల సాంబయ్య,దామెర లింగమ్మ,జవాజి రాజు, కాయతి శ్రీనివాసాచారి, ననబాల శ్రీనివాస్,గణపురం చంద్రమౌళి,ననుబాలా వినోద్, ఉడుగుల పెద్దాపురం,నను బాల మల్లేష్,పురం సంపత్, మయ్య వెంకన్న,చామకూరి విజయరావు,ఆగబోయిన మధుసూదన్,పోదెం నితిన్, ఎదునూరి గోపాల్,బొడ్డు నగేష్,దిడ్డి శ్రీనివాస్,కల్తీ మల్లేష్,మర్కం రమేష్, గుండ్లపల్లి యాదగిరి, పాల్గొన్నారు.