దివ్యాంగులకు అండగా ఉంటా
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్
చిట్కుల్లోని క్యాంప్ ఆఫీసులో నీలం మధు ను కలిసిన వికలాంగుల నేతలు
సంగారెడ్డి ఏప్రిల్ 11
సంగారెడ్డి జిల్లా పటన్ చేరు నియోజక వర్గం దివ్యాంగులకు అండగా ఉండి, న్యాయమైన హక్కుల కోసం తనవంతుగా పోరాడుతానని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంప్ ఆఫీస్ లో తెలంగాణ వికలాంగుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మడపర్తి రవికుమార్, ఇస్నాపూర్ గ్రామస్తులతో నీలం మధును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ… వికలాంగుల తరపున నీలం మధుకు తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. వికలాంగుల న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నామని, తమకు సహకరించాలని రవికుమార్ కోరారు. ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని ఈ సందర్భంగా నీలం మధు కి హామీ ఇచ్చారు. రవికుమార్ వెంట ఇస్నాపూర్ యువ చైతన్య దివ్యాంగుల సంఘం అధ్యక్షులు కంచి మహేష్ కుమార్, సభ్యులు బజార్ సంపత్ కుమార్, సాయికుమార్, సాయిలు, సత్యనారాయణ రెడ్డి, పరిపూర్ణ, అంబు భాయ్, కిషోర్ తదితరులు ఉన్నారు.





