మెదక్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు డీఎంహెచ్‌ఓ ఉద్యోగి పట్టుబడిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. మెదక్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో కమ్యూనిటీ హెల్త్ అధికారి షాహిం పాషా ఒకరి వద్ద లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. మెదక్ పట్టణం బావార్చి హోటల్ సమీపంలో రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను గుర్తించిన ఫాహిం పాషా పారిపోయే ప్రయత్నం చేయగా అధికారులు వెంటబడి పట్టుకొని డీఎంహెచ్ఓ కార్యాలయానికి తరలించి విచారణ జరుపుతున్నారు. ఏసీబీ కి చిక్కిన ఫాహిం పాషా ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
