ఆత్మహత్యలు పరిష్కారం కాదు
వేణు కుటుంబానికి అండగా ఉంటాం
టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ
సెప్టెంబర్ 21
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మనిషికి సమస్యలు అనేవి సహజమేనని, అయితే మనోధైర్యంతో వాటిని పరిష్కరించుకోవాలి తప్పా ఆత్మహత్యలు మార్గం కాదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అన్నారు.
ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అప్పుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వేణు మాధవ్ కుటుంబాన్ని గురువారం రోజు ఆయన పరామర్శించి, గజ్వేల్ ప్రెస్ క్లబ్ మరియు నియోజకవర్గ జర్నలిస్టుల నుండి ప్రోగుచేసిన లక్షా 9వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వేణు మాధవ్ భార్యకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ జర్నలిస్టు, తమ యూనియన్ క్రియాశీలక సభ్యుడు వేణు మాధవ్ అకాల మృతిని జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలిపారు. వేణు కుటుంబానికి తమ సంఘం అండగా నిలబడి, అన్ని విధాలా చేయుతనిస్తుందని విరాహత్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కే. రంగాచారీ, జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, జిల్లా కార్యదర్శి క్రిష్ణ, గజ్వేల్ జర్నలిస్ట్స్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎన్నెల్లి సురేందర్, కే.మధుసుధన్ రెడ్డి, సొసైటీ సభ్యులు జమీల్, కిరణ్, లక్ష్మీనారాయణ, సతీష్, నాగవెంకట్ రెడ్డి, శ్రీనివాస్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
