రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన యువకుడు పురుగుమందు సేవించి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
సముద్ర లింగాపూర్ కు చెందిన మల్లవరం సుజాత మధుసూదన్ రెడ్డి దంపతుల ఏకైక కుమారుడు అనుదీప్ రెడ్డి (19) మంగళవారం పురుగుల మందు సేవించి అపస్మరక స్థితిలోకి వెళ్ళగా వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేటలో ప్రవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తుండగా బుధవారం రాత్రి మృతి చెందాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కుటుంబంలో ఏకైక కుమారుడు తల్లిదండ్రుల కళ్ళముందే మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులలో శోకసముద్రంలో మునిగిపోయారు.
