(తిమ్మాపూర్ ఏప్రిల్ 26)
గత కొంతకాలంగా కరీంనగర్ లో వివిధ ప్రాంతాల నుంచి బైకులు చోరీలకు గురవుతున్నాయని కంప్లైంట్ రావడంతో కరీంనగర్ 1 టౌన్ పోలీసులు నిఘాపెట్టి పక్క సమాచారంతో నిందితులను గుర్తించి, వారి వద్ద నుండి 20 కి పైగా బైకులను స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన బోయిని చంద్రబాబు, గోనెల శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో గత కొంతకాలంగా కరీంననగర్ తో పాటు వివిధ ప్రాంతాలలో ఖాళీ ప్రదేశంలో ఉన్న బైకులను దొంగలించారు..
ఈరోజు తెల్లవారుజామున కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో నిందితుల ఇండ్లకు వెళ్లి విచారించగా, బైక్ లను దొంగలించమని నిజాన్ని ఒప్పుకోవడంతో వారి వద్ద నుండి 20 కి పైగా బైక్ లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు..