జగిత్యాల సెప్టెంబర్ 19
కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు ఇంటింటికి చేర్చాలి..
కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం..
పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి .
కాంగ్రెస్ లో చేరిన బీ అర్ ఎస్ నాయకులు, రైతులు..
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి..పార్టీ లోకి ఆహ్వానించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి..
*ఇదే నిజం. జగిత్యాల:*
మల్యాల మండలానికి చెందిన రైతులు, బీఅర్ఎస్ నాయకులు మంగళవారం చొప్పదండి నియోజక వర్గం ఇంఛార్జి మేడిపల్లి సత్యం, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అద్యక్షుడు వాకిటి సత్యం రెడ్డి,మండల అధ్యక్షుడు దొంగ ఆనంద రెడ్డి, మాజీ ఎంపీపీ దారం ఆదిరెడ్డి అధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరారు..కొమ్ముల సుదర్శన్ రెడ్డి, కొమ్ముల మహేశ్వర రెడ్డి, కమలాకర్ రెడ్డి,మల్యాల సింగిల్ విండో డైరెక్టర్ సంత ప్రకాష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, సంత శ్రీధర్ రెడ్డి, తదితరులకు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ అభయ హస్తం పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీ పథకాలను ఇంటింటికి తీసుకెల్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి, ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ పాలనలోనే రైతులు, మహిళలు, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కిసాన్ సెల్ అద్యక్షుడు వాకిటి సత్యం రెడ్డి, కాంగ్రెస్ చొప్పదండి నియోజక వర్గ ఇంఛార్జి మేడిపల్లి సత్యం, దొంగ ఆనంద రెడ్డి,మాజీ ఎంపీపీ దారం ఆదిరెడ్డి, రాజిరెడ్డి, నల్ల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
