రామగుండం పోలీస్ కమిషనరేట్
పెరట్లో గంజాయి మొక్కల సాగు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
రామగుండం పోలీస్ కమిషనరేట్ బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా 2 ఇంక్లైన్ ప్రాంతం లోని ఒక ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు అనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇంటిని ఆవరణలో తనిఖీ చేయగా కుమ్మరి లింగయ్య సన్నాఫ్ వెంకటి, ఆర్ ఓ నంబర్ . 2 ఇంక్లైన్ బెల్లంపల్లి అను వ్యక్తి పెరట్లో (06) గంజాయి మొక్కలు సాగుచేస్తునట్లు గుర్తించడం జరిగింది. గంజాయి మొక్కలను తదుపరి విచారణ నిమిత్తం బెల్లంపల్లి -2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. సాగు చేస్తున్న నిందితుడు కుమ్మరి లింగయ్య పరారిలో ఉన్నాడు.






