వర్ధన్నపేట నియోజక వర్గం నవంబర్ 11
24/7 తెలుగు న్యూస్
కేసిఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పలువురు బి అర్ ఎస్ పార్టీ లో భారీగా చేరుతున్నారు.హన్మకొండ లోని అరూరి రమేష్ నివాసంలో ముల్కలగూడెం, వంగపహాడ్,హసన్ పర్తి గ్రామాలకు చెందిన 300 మoదికి పైగా వర్ధన్నపేట నియోజకవర్గ బి అర్ ఎస్ పార్టీ అభ్యర్ధి అరూరి రమేష్ సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది.వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లడుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావడంతో ప్రజలు రాజకీయాలకు అతీతంగా టిఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తున్నారని తెలంగాణ ప్రజలు అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారని సంక్షేమ విషయంలో కెసిఆర్ రాజిపడే ప్రసక్తి లేదని పార్టీ కోసం నిజాయితీగా కష్టపడే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కేసిఆర్ రైతులకు రైతుబంధు రైతు బీమా 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తూ రైతులను అక్కున చేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గం మనకు శ్రీరామరక్ష అని టిఆర్ఎస్ పార్టీ నాకు మూడోసారి అవకాశం ఇచ్చినందున మీరందరూ నన్ను ఆశీర్వదించి మరొకసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అన్నారు.





