పాత్రికేయుల సేవలు ఎనలేనివని సమాజ సేవకులుగా ఉంటారని ప్రెస్ క్లభ్ అద్యక్షులు ఎండి మజీద్ పాత్రికేయులు సమాజసేవకులని ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లభ్ సభ్యులకు ప్రజాప్రతినిధులు అదికారులు సహాకరించాలని ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లభ్ అద్యక్షులు ఎండి మజీద్ కోరారు , ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ పాలకవర్గం ఎన్నికలు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగాయి, గౌరవ అధ్యక్షులుగా బుగ్గ కృష్ణమూర్తి శర్మ , అధ్యక్షులుగా ఎండి మజీద్ , ఉపాధ్యక్షులుగా చేపూరి నాగరాజు గుప్తా కులేరి కిషోర్ ,ప్రదాన కార్యదర్శిగా సయ్యద్ షరీఫ్ ,సహాయ కార్యదర్శిగా కందుకూరి రవి కోశాధికారిగా శ్రీ రామోజీ శేఖర్ ,ముఖ్య సలహాదారుగా బండారి బాల్ రెడ్డి , మొహమ్మద్ లతీఫ్ , కార్యవర్గ సభ్యులుగా కొండ్లేపు జగదీశ్వర్ , శ్రీ రామోజూ దేవరాజు , కూలేరి దీప్తి , ఉరిమడ్ల నరేష్ , శ్రీరామోజు ప్రవీణ్ , దుర్గం విజయ్ బాబు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా ప్రెస్ క్లభ్ అధ్యక్షులుగా ఎన్నికైన ఎండి మజీద్ మాట్లాడుతూ సమాజ సేవ కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎల్లారెడ్డిపేట మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు సహాయ సహాకారాలు అందించాలని ఆయన కోరారు మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ప్రభుత్వ పరంగా అన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు ప్రతి జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇప్పించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు
