Breaking News

100 Views

*పాత పెన్షన్ విధానం అమలు చేయాలని మంత్రి గంగులకు వినతి పత్రం అందజేసిన ఉద్యోగులు*

*సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ*

2004 సెప్టెంబర్ 1 వ తేదీకి ముందు ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదలై ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు 2003 పాత పెన్షన్ పోరాట సాధక సమితి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను కలిసి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ 2004 జనవరి 1 తేదీకి ముందు నియామక ప్రక్రియ పూర్తయి 2004 జనవరి 1 తేదీ తరువాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మెమో నం. 27/05/2021 జారీ చేసింది అని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సీపీఎస్ విధానాన్ని అమలు చేయాల్సి ఉన్నా కూడా జాప్యం చేస్తూ ఉద్యోగులను మానసిక ఆవేదనకు వురి చేస్తుంది అని అన్నారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు న్యాయమైన డిమాండ్ ను నెట్లీవర్చాలని కోరారు. మంత్రి గంగుల స్పందిస్తూ ఈ విశయాన్ని క్యాబినెట్ సమావేశంలోనూ, అలాగే ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తా అని హామీ ఇచ్చారు.ఈ

కార్యక్రమంలో నల్ల రాజేందర్ రెడ్డి, రామ్ కిరణ్, వీరేందర్ రెడ్డి,ముకుంద రెడ్డి, జైపాల్ రెడ్డి, మాధవా రెడ్డి, విష్ణు ప్రసాద్ రావు, నరేష్, భవాని, స్వప్న, గాయత్రి పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *