సెప్టెంబర్ 16
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం, వైఎస్ వివేకనందరెడ్డి కేస్ మరియు రాజకీయపరమైన ఇబ్బందులు వంటి వల్ల సతమతమవుతున్న జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి బిజెపి పన్నుతున్న ఎత్తుగడగా విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.
భారతీయ జనతా పార్టీ భారీ కుట్రకి కుదరలేపింది. వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీ అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది.
ఢిల్లీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న వైసిపి కి చెందిన నాయకులను జగన్మోహన్ రెడ్డి ద్వారా బిజెపి ప్రభుత్వం లోబర్చుకుని బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత పేరు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
అందులో భాగంగానే వైసీపీతో సన్నిహితంగా మెలిగే ఇటీవల టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితుడైన శరత్ చంద్రారెడ్డిని అప్రూవల్ గా మార్చుకున్న ఈడీ ఆ తర్వాత కాలంలో మాగుంట రాఘవను, ఆయన తండ్రి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అప్రూవర్ గా మార్చుకుంది.
తెలంగాణకు చెందిన నాయకురాలి పేరు చెప్పాల్సిందిగా ఇప్పటికే అరెస్టు అయిన నిందితులను బెదిరిస్తున్న దర్యాప్తు సంస్థలు కొత్త కుట్రకు తెరలేపాయని సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం, రాజకీయపరమైన ఇబ్బందులు వంటి వల్ల సతమతమవుతున్న జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి బిజెపి పన్నుతున్న ఎత్తుగడగా విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.
