Breaking News

నిజమైన చరిత్ర తెలుసుకోవాలి

133 Views

తెలంగాణ విమోచన దినోత్సవం పై సెమినార్ నిర్వహించిన: ఎబివిపి

విద్యార్థులు నిజమైన చరిత్ర తెలుసుకోవాలి : ముఖ్య వక్త సందింటి భాస్కర్ రెడ్డి.

సెప్టెంబర్ 16

సిద్దిపేట జిల్లా  భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవని పురస్కరించుకొని విద్యార్థులకు సెమినార్ నిర్వహించడం జరిగింది

సరస్వతి మాత , స్వామి వివేకానంద చిత్ర పటాలకు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ప్రజ్ఞ భారతి జిల్లా అధ్యక్షులు సందిటి భాస్కర్  ప్రసంగిస్తూ”దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ యొక్క తెలంగాణ ప్రాంతం బానిసత్వంలో మునిగిపోయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 1948 సెప్టెంబర్ 12న సైనిక చర్య ఆపరేషన్ పోలో పేరు మీద ఈ యొక్క తెలంగాణ ప్రాంతం నాలుగు దిక్కుల నుండి సైనికులతో ముట్టడించి యుద్ధం చేసి సెప్టెంబర్ 17న నిజాం యొక్క చివరి రాజైన మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ను ఓడించి,ఉస్మాన్ అలీఖాన్ లొంగిపోయి ఈ యొక్క భారత దేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని అంతర్భాగంగా కేంద్ర ప్రభుత్వం చేసిన సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ ప్రాంతానికి నిజాం యొక్క చరల నుండి విముక్తి పొందిన సందర్భంగా విమోచన దినోత్సవం జరుపుకోవడం జరుగుతా ఉంది.

గత చరిత్ర తీసుకుంటే ఈ దేశంలో దండయాత్ర చేసినటువంటి మొగలులు, నిజాములు ,బ్రిటిష్ వాళ్ళ యొక్క చరిత్రను మన యొక్క పాఠ్య పుస్తకాల్లో ఎక్కువ భాగం ఉంది. కానీ ఈ యొక్క దేశం స్వాతంత్రం కోసం ఈ యొక్క తెలంగాణ ప్రాంత విమోచన కోసం ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను తృణప్రయంగా వదులుకొని పోరాడినటువంటి చరిత్రను నేటి విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

నిజాంల యొక్క అరాచకాలను ఈ యొక్క సమాజం భరించలేక బానిసత్వ సంకెళ్లను తెంచుకొని పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్క ఉద్యమకారుని గుండెల్లో రగిలించి ఉద్యమం చేసినటువంటి వీరులు కన్నా తెలంగాణ ప్రాంతం. నేడు విమోచన దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మహిళలు,పిల్లలు విపరీతమైనటువంటి అణచివేత కు గురైనటువంటి పరిస్థితుల మధ్య పోరాటాలు సాగించారు.

నేటి తెలంగాణ ప్రాంతం నాడు మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రం పేరు మీద ఉండేది. దేశ స్వాతంత్రానంతరం భాష ప్రాతిపదికన రాష్ట్రాలను విభజించిన సందర్భంగా నేడు 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి యువత అందరూ ఈ నిజమైన చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేయాలని మార్గ నిర్దేశం చేశారు” . కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బీరకాయల వివేక్, నగర కార్యదర్శి చింతల పవన్, ఎబివిపి బాధ్యులు శంకర్, ఫణీంద్ర, జైయేష్, రాజు, మారుతి, మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *