రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజ సింగవరం గ్రామంలో ఓ వ్యక్తి అప్పుల బాధతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై మహేష్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గజ సింగవరం గ్రామానికి చెందిన సుతారి ఆంజనేయులు(41) అనే వ్యక్తి ఇటీవల కూతురు వివాహంతో పాటు ఇంటి నిర్మాణానికి అప్పులు చేశాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో మనస్థాపానికి గురై శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇంట్లో ఎవరి లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.