మర్కుక్ ,ఆగస్టు 6
సిద్దిపేట జిల్లా,మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామాన్ని సందర్శించిన మర్కుక్ ఇన్స్పెక్టర్ ఓ.దామోదర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రవల్లి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలిపారు.అదేవిధంగా గంజాయి ఇతర మత్తు పదార్థాలు,పేకాట గురించి తెలిసినచో స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపవలసిందిగా చెప్పారు.బీహార్ మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కార్మికులను పనిలో చేర్చుకునేటప్పుడు వారి యొక్క ఆధార్ కార్డులను సేకరించి పోలీస్ స్టేషన్లో సమర్పించాల్సిందిగా తెలిపారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,అపరిచితులకు ఓటిపి,ఇతర సమాచారం తెలుపకూడదని,ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా రైతులకు అపరిచితులు వ్యవసాయ అధికారులం అని ఫోన్ చేసి ఓటీపీలు చెప్పాలని కోరడం జరుగుతుంది.దానిద్వారా ప్రజలు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు వాటిని నమ్మకూడదని,సంబంధిత అధికారిని సంప్రదించిన తర్వాత ఓటీపీలు చెప్పాలని ఎస్సై దామోదర్ ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
