రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రం ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన అసంపర్తి దివాకర్(30) అనే యువకుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్ కు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుని భార్య సౌందర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
