*పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల తెగువకు ప్రపంచానికి చాటి చెప్పిన మహిళాలోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత, భూమికోసం, భుక్తికోసం, బహుజనుల, కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం, అలుపెరుగని పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. రజక సంఘం నాయకులు మాట్లాడుతూ, దొరల గడిలు కూల్చి వేల ఎకరాలను ఎకరాలను బహుజనులకు పంచిన వీరనారి చాకలిఐలమ్మ అని అన్నారు.. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చేర్మెన్ కొండూరి రవీందర్రావు, రజక సంఘం అధ్యక్షులు గుండారం మహేందర్, తెరాస మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్, పట్టణ అధ్యక్షుడు పెద్దవేణి వెంకట్ యాదవ్, తెరాస సీనియర్ నాయకులు రాజారామ్, నారాయణరావు, కమలాకర్రెడ్డి, ఏగదండీ స్వామి, జంగపల్లి శేఖర్ గౌడ్, రజక సంఘం నాయకులు, అల్వాల రాజు, ఓరగంటి ఎల్లము, నరసింహులు, సోషల్ మీడియా నాయకులు ఏగ దండి రవి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.