Breaking News

మంత్రుల పర్యటనతో కొండగట్టులో భక్తులకు తప్పని ఇక్కట్లు*

113 Views

*మంత్రుల పర్యటనతో కొండగట్టులో భక్తులకు తప్పని ఇక్కట్లు*

 

 

*తిండీతిప్పలు లేక మూడు గంటల నిరీక్షణ*

 

మల్యాల :జులై 15

కొండగట్టులో అంజన్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వై జంక్షన్ నుంచి జేఎన్టీయూ కాలేజ్ వరకు ట్రాఫిక్ జాం అయ్యింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మంత్రులు, ఎమ్మెల్యేలు రావడంతో ఆలయంలోనికి భక్తులను ఆలయ అధికారులు అనుమతించ లేదు. అంజన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తిండీతిప్పలు లేకుండా మూడు గంటల పాటు ఆలయ ముఖ ద్వారం వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.

 

వై జంక్షన్ నుంచి జేఎన్టీయూ కాలేజ్ మధ్యలో గల స్థలంలో మొక్కలు నాటే కార్యక్రమం ఉండడం వల్ల మంత్రుల కాన్వాయ్ రోడ్డపై ఉంచి భక్తుల వాహనాలకు పోలీసులు అనుమతించ లేదు. దీంతో రెండు, మూడు కి.మీ. మేర ట్రాఫిక్ జాం తో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంత్రులు వస్తే తమకేంటని భక్తులు ప్రశ్నించారు. మనస్ఫూర్తిగా స్వామి వారి దర్శనం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా అధికారులు ప్రవర్తించారని భక్తులు తెలిపారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *