సమయానికి బస్సులు నడపాలి
సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి
చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఉదయం బస్సులు సమయానికి రావడంలేదని అలాగే సాయంత్రం అసలు బస్సు రావడం లేదని పోతిరెడ్డిపల్లి బస్టాండ్ ముందు కాలేజీ విద్యార్థులు గ్రామస్తులతో కలిసి కత్తుల భాస్కర్ రెడ్డి ఆందోళన నిర్వహించారు
ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బస్సులు సమయానికి రావడం లేదని అందువల్ల విద్యార్థులు బస్సు పాసులు తీసి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోతిరెడ్డిపల్లి నుంచి ఉదయం 9 గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు బస్సులో అందుబాటులో ఉండాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అధికారులు చొరవ చూపాలని కోరారు అనంతరం జనగామ డియంతో ఫోన్లో మాట్లాడారు అనేక ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటున్నారని ఉదయం సాయంత్రం కచ్చితంగ రావాలని జనగామ డిఎం తో మాట్లాడారు సోమవారం నుండి ఉదయం, సాయంత్రం కచ్చితంగా పంపిస్తానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు
