(తిమ్మాపూర్ సెప్టెంబర్ 14)
కరీంనగర్ పట్టణం లో కమాన్ చౌరస్తా లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 15 నుండి 17 వరకు జరిగే విశ్వకర్మ బ్రహ్మోత్సవాలలో ప్రతీ ఒక్కరూ హాజరుకావాలని రామక్రిష్ణకాలనీ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కోరారు. గురువారం అమావాస్య సందర్బంగా తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణకాలనీ గ్రామంలో జరిగిన సమావేశంలో కరపత్రాలను పంపిణి చేసారు.
ఈ సందర్బంగా మండలంలోని విశ్వబ్రాహ్మణ కులస్తులు కుటుంబాలతో 3 రోజులు జరిగే పూజల్లో పాల్గొనాలని కోరారు.కులాబాందవులే కాకుండా సర్వ మానవాలి శ్రేయస్సు కోరే భగవంతుని బ్రహ్మోత్సవాలకు ప్రజలను కూడా పిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గుజ్జుల ప్రణీత్ రెడ్డి, సంఘం అధ్యక్షులు పాలోజు నాగభూషణం, ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు పెద్ద శ్రీనివాస్,ఎదులాపురం రవీంద్రాచారి,వేములవాడ నర్సింహచారి, సుగుర్తి బ్రహ్మచారి, తెలుకుంట్ల రాము, శ్రీరామోజు కమలాకర్, పెందోట అనంతచారి,కర్ణకంటి శ్రీనివాస్,వేములవాడ శ్రీనివాస్,అలవాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.