(తిమ్మాపూర్ అక్టోబర్ 21)
తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం రాత్రి మాంగల్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబురాలను ఘనంగా నిర్వహించారు.బతుకమ్మ వేడుకలకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ సతీమణి మాధవి, వారి కోడలు హర్షిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాంగల్యం ఫౌండేషన్, చైర్ పర్సన్ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డా. బత్తిని కీర్తి లత గౌడ్ వారికి స్వాగతం పలికారు.సాంప్రదాయాలు అనుసరిస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించారు.ప్రకృతిలో లభించేటువంటి వివిధ రకాల పూలతో, ఆకులతో అందంగా బతుకమ్మను తయారు చేసి గౌరీ దేవిని ప్రతిష్టించి పల్లెతనాన్ని వివిధ పాటలు పాడుతూ బతుకమ్మను ఆరాధించారు.గ్రామంలోని మహిళలలు బారి బతుకమ్మను మధ్యలో పెట్టి కోలాటాలు ఉయ్యాల పాటలు డీజే పాటల నడుమ బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి సతీష్, ఉప సర్పంచ్ బుడిగే పర్శరాములు గౌడ్, ఎంపిటిసి పుప్పాల కనకయ్య, మహిళలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.