(తిమ్మాపూర్ సెప్టెంబర్ 26)
తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ సహిత శ్రీ జటేశ్వర కాశీ విశ్వేశ్వర ఆలయం వద్ద రాయల్ యూత్ ఆధ్వర్యంలో పింగిలి వెంకవ్వ-రాజిరెడ్డి,పింగిలి వరలక్ష్మి-కృష్ణారెడ్డి సమక్షంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో గొల్లపల్లి ప్రజలు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పింగిలి రాజిరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.