ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు.
హైదరాబాద్:సెప్టెంబర్ 14
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
రేపు విచారణ హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారిన తర్వాత కవితను మరోసారి విచారణకు పిలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది ఈ క్రమంలో ఈ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్ అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు.
ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమచారం ఈ క్రమంలో అరుణ్ నుంచి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
