Breaking News

నిర్వాహకుల వేధింపులు సింగరేణి ఉద్యోగి బలి

109 Views

..యాప్ లోన్ నిర్వాహకుల వేధింపులు

← Back

Thank you for your response. ✨

సింగరేణి ఉద్యోగి బలి

సెప్టెంబర్ 14

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం యాప్ లోన్ నిర్వాహకుల వేధింపుల వల్ల మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొల్లూరు గ్రామానికి చెందిన వంశీకృష్ణ సింగరేణిలో ఉద్యోగం చేస్తూ పెద్దపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఆన్ లైన్ యాప్ ద్వారా రుణం తీసుకొని ఇప్పటికే రూ.రెండున్నర లక్షలు చెల్లించినా, లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో యాప్ లోన్ నిర్వహకుల వేదింపులు తాళలేక గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల వల్లే వంశీకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దపెల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *