– అడ్డుకున్న పోలీసులు…
– బిజెపి నాయకులు అరెస్ట్
రాష్ట్రంలోని కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను, ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, 2014,2019 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన పథకాల ను నేటికీ సక్రమంగా అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో కెసిఆర్ సర్కార్ ఉండడం సిగ్గుచేటని,బూటకపు మాటలతో , మాయమాటలతో ప్రజానీకాన్ని మభ్యపెడుతూ గోసపెడుతున్న కెసిఆర్ సర్కార్ ని రాబోయే ఎన్నికల్లో తరిమి కొట్టాలని బిజెపి నేతలు అన్నారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బిఆర్ఎస్ లోగడ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన వివిధ సంక్షేమ పథకాలు,డబల్ బెడ్ రూమ్ ఇల్లులు,దళిత,బీసీ బందు, నిరుద్యోగ భృతి,వివిధ రకాల పింఛన్లు,రేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ,రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల ను నిరసిస్తూ మానకొండూర్ బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ నేతలు బుధవారం మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వైపు వెళ్లిన బిజెపి నేతలు కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పి టి సి కి తరలించారు. పోలీసుల బలవంతపు అరెస్టుతో పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
ఈ సందర్భంగా బిజెపి మానకొండూరు నియోజకవర్గ నేతలు మాట్లాడుతూ కెసిఆర్ బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతున్న పార్టీలను , ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు , నిర్బంధాలతో పోలీసుల రాజ్యాన్ని నడిపిస్తుందన్నారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు , ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కెసిఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్యంగా డబల్ బెడ్ రూమ్ ఇల్లులు, వివిధ రకాల పింఛన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు , నిరుద్యోగ భృతి లాంటి హామీలను అమలు చేయడంలో కెసిఆర్ సర్కార్ అట్టర్ ప్లాప్ అయిందన్నారు. ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గం పరిధిలో అర్హులైన ప్రజలు ఎంతోమంది ఉన్నా నేటికీ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించింది లేదని లేదని , ఇది పూర్తిగా ప్రభుత్వ , స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వైఫల్యం అన్నారు. మళ్లీ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అనేక మోసపూరితప్రకటనలు చేస్తున్నారనీ, .
బీసీబంధు, మైనారిటీ బంధు, గిరిజన బంధు , గృహలక్ష్మి లాంటివి ప్రకటించి ప్రజల్ని మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లోగోడ ప్రకటించిన పథకాలకే దిక్కు లేదు కానీ. , మళ్లీ కొత్త పథకాలతో ప్రజలను మోసం చేయాలనుకోవడం మూర్ఖత్వమని , ఆయన కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల హామీలు , సంక్షేమ పథకాలు అమలు చేయించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పైనే ఉందని, అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన తర్వాతే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నియోజకవర్గంలో తిరగాలని, లేకుంటే ఆయనను బిజెపి ఆధ్వర్యంలో ఏక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. రెండు పర్యాయాలు మానకొండూరు ఎమ్మెల్యేగా పనిచేసిన రసమయి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలు కూడా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను ఇంటికి సాగడంపడానికి నిశ్చయించుకున్నారన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికెసిఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదని, మోసపూరిత బి ఆర్ ఎస్ విధానాల కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ముట్టడి కార్యక్రమం సమాచారం మేరకు తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి, మానకొండూర్ సిఐ రాజకుమార్, ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి,గన్నేరువరం ఎస్ఐ నర్సింహారాజు తో పాటుగా సుమారు 30 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి,గడ్డం నాగరాజు, సొల్లు అజయ్ వర్మ,జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి, అధికార ప్రతినిధులు అలివేలి సమ్మిరెడ్డి, బొంతల కళ్యాణ్ చంద్ర,ఎంపిటీసి అంతం రాజిరెడ్డి,తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం సుగుర్తి జగదీశ్వరాచారి, నగునూరి శంకర్, ఎనుగుల అనిల్ తో పాటుగా ఆయా మండలాలకు చెందిన సుమారు 100 మందికి పైగా ఈ ముట్టడి లో పాల్గొన్నారు.