బగ్గుమన్న తెలుగు తముళ్లు
హుస్నాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దిష్టి బొమ్మ దగ్నం
సెప్టెంబర్ 14 హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తాలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది, అనంతరం బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కేవలం కక్ష సాధింపు చర్యలు అని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఛార్జ్ షీట్ లో లేని పేరును కావాలని చేర్చి చంద్రబాబు ని అక్రమంగా అరెస్ట్ చేశారని దీన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో జగన్ కి బుద్ది చేపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
