*చేర్యాల ప్రాంతంలో తిరగాలంటే రెవిన్యూ డివిజన్ ప్రకటించాలి*
*ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందె బీరన్న*
: ఆగస్టు చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఉద్యమంలో ప్రజలు, మేధావులు విద్యార్థులు సబ్బండావర్గాలు ఉద్యమంలో కలసి రావాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకులు అందె బీరన్న డిమాండ్ చేశారు.
చేర్యాల మండల కేంద్రంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని హంగులు కలిగిన చేర్యాల ప్రాంతాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేసి ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతీశారని ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం చేర్యాల రెవెన్యూ డివిజన్ కావడమే మన లక్ష్యమని అదే విధంగా పాత నియోజకవర్గాన్ని సాధించుకునే దిశగా చేర్యాల రెవెన్యూ డివిజన్ చేసి ఉద్యమాన్ని గత ఐదు సంవత్సరాల నుండి కొనసాగిస్తుందని ఈ ఉద్యమంలో విద్యార్థులు మేధావులు యువజనులు మహిళలు కార్మిక కర్షక ఉద్యోగులు సబ్బండ వర్గాలు కలసి వచ్చి ఈ ఎన్నికల ముందు చేర్యాల రెవెన్యూ డివిజన్ గా ఏర్పడేంతవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కల ఆటగా విడిపోయిన నాయకులు ఏ నాయకుడైన ఈ ప్రాంతానికి న్యాయం చేసిన దాఖలా లేదని ఎవ్వరు వచ్చిన ఎన్నికల ముందు చేర్యాల రెవెన్యూ డివిజన్ జీవో కాపీని తీసుకువస్తేనే ప్రజలలో తిరగనిస్తామని ఈ ప్రాంతంలో అడుగు పెట్టనిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు రెవెన్యూ డివిజన్ సాధన లక్ష్యంగా గతంలో ప్రజా చైతన్య యాత్ర ద్వారా గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యం చేసిన ఘనత చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ దక్కుతుందని అదేవిధంగా సాధన ఉద్యమంలో మిల్టెంట్ తరహా ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవడం కోసం జేఏసీ నిబద్ధతతో నిజాయితీగా ఉద్యమాన్ని నడిపిస్తుందని ఈ ఉద్యమానికి మేధావులు సబ్బండ వర్గాలు కలసి వచ్చి చేర్యాల రెవెన్యూ డివిజన్ అయ్యేంతవరకు ఉద్యమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాలు అవుతున్న ఈ ప్రాంత ప్రజలు ఐదు సంవత్సరాల నుండి రెవెన్యూ డివిజన్ కావాలని ఉద్యమిస్తున్న స్థానిక మంత్రి ఎమ్మెల్యే ఈ ప్రాంతం మీద సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనే లక్ష్యంగా ఈ జేఏసీ పనిచేస్తుందని త్వరలో ప్రతి గ్రామంలో చైతన్య యాత్రలు నిర్వహించి గ్రామ గ్రామాన జేఏసీ నిర్మాణాన్ని చేసి ప్రజల ఉద్యమాన్ని ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు బుట్టి బిక్షపతి తెలుగుదేశం పార్టీ నాయకులు లింగం భారత నాస్తిక సమాజం రాష్ట్ర నాయకులు నాస్తిక్ రమేష్ ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు బందిగ రాకేష్ కృష్ణ, ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు, ఎన్ ఎస్ యు ఐ చేర్యాల మండల అధ్యక్షులు మహమ్మద్ నవాజ్, వెల్ది సాయికిరణ్ రెడ్డి, ఎర్ర సంతోష్, స్వామి తదితరులు పాల్గొన్నారు
