Breaking News

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు..*

68 Views

*ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు..*

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును జులై 31 వరకు పెంచుతూ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం జులై 25తో గడువు ముగియగా తాజాగా తుది గడువును ఈ నెలాకరు వరకు పొడిగించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ మేరకు పొడిగించారు.జులై 31 తర్వాత అడ్మిషన్లు పొందే విద్యార్ధులు ఆలస్య రుసుము చెల్లించవల్సి ఉంటుందని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *