– ఏపీజీవీబీ మేనేజర్ అనిల్
దౌల్తాబాద్, సెప్టెంబర్ 13: బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని ఏపీజీవీ బ్యాంకు మేనేజర్ అనిల్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో ఏపీజీవీ బ్యాంక్ దౌల్తాబాద్ ఆధ్వర్యంలో బ్యాంకు సేవలు, వ్యక్తిగత ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ లు, పంట రుణాలు, మహిళా సంఘాల రుణాలు, తదితర అంశాలపై మ్యాజిక్ షో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ
బ్యాంకు లావాదేవీలు, ఫోన్ బ్యాంకింగ్, ఏటీఎం సేవల గురించి తెలుసుకుంటే సైబర్ మోసాలకు గురికాకుండా ఉండవచ్చు అన్నారు. బ్యాంకు ద్వారా అందిస్తున్న ప్రమాద బీమా తదితర వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ తిరుపతి, బ్యాంకు సిబ్బంది అజయ్, ప్రభాకర్, గ్రామస్తులు లక్ష్మణ్, స్వామి గౌడ్, కవిత, తదితరులు పాల్గొన్నారు….




