గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఠాణా దివస్ లో ప్రజల వద్ద నుండి 50 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ప్రజలకు మరింత చేరువగా పోలిసింగ్ వెళ్ళడానికి,వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి వారంలో ఒక రోజున ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహించి ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి అట్టి సమస్యలు పరిష్కరిస్తు ప్రజలకు భరోసా కల్పిస్తున్నా జిల్లా పోలీస్ యంత్రాంగం..
గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్లో మంగళవారం రోజున “ఠాణా దివస్” కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉదయం నుండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల వద్ద నుండి 50 అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే అధికారులకు ఆదేశాలు జరిచేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.