మంథని మండలంలోని గాజులపల్లి గ్రామానికి చెందిన రొడ్డ ఆదర్శ్ (21) గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆదర్శ్ శుక్రవారం రాత్రి ఇంటిలో నుండి బయటకు వెళ్లాడన్నారు. తెల్లవారుజామున చెట్టు కు ఉరి వేసుకున్నట్లు తెలిసిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
