Breaking News నేరాలు ప్రాంతీయం

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు

165 Views

రోడ్డు ప్రమాదంలో గొల్లపల్లి వాసి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
:రాజన్న సిరిసిల్ల జిల్లా లో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన బండి సందీప్29, బండి బాబు30 లు బుధవారం వ్యక్తిగత పనులపై పల్సర్ TS 23B 5438 నెంబర్ గల బైకుపై సుద్దాల గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రగుడు రెండవ బైపాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కిందపడి బండి సందీప్ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందగా బండి బాబుకు తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతునికి భార్య లాస్య, మూడు సంవత్సరాల కూతురు, తల్లి సుగుణ ఉన్నారు. సంఘటన విషయం తెలవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఒక్కసారిగా గొల్లపల్లిలోని విషాదఛాయలు అలుముకున్నాయి. మృతున్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *