సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 12 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన రాగుల సాయి కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న సిద్దిపేట జిల్లా శ్రీ కొరివి కృష్ణ స్వామి అధ్యక్షులు ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు మరియు ముదిరాజ్ సంఘం మహాసభ సిద్దిపేట జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు అంతాయగూడెం సర్పంచ్ తీగుళ్ల సత్యం లు కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికీ ₹ 10.000/- రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాగుల సాయికుమార్ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని తెలిపారు. వారు మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు.
