రాయపోల్ మండలం సయ్యద్ నగర్ లో బీజెపి, బిఆర్ఎస్ పార్టీల నుండి యువకులు, మహిళలు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తప్పెట సుధాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
